టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు!

Jun 9,2024 11:50 #TDP, #Two Union Minister posts

అమరావతి: ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి రెండు మంత్రి పదవులను ఖరారు చేసినట్టు సమాచారం. వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి, మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి కేటాయించినట్టు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న రామ్మోహన్‌నాయుడికే ఉన్నత హోదా అప్పగించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

➡️