న్యూఢిల్లీ : అల్ట్రాక్యాబ్ (ఇండియా) లిమిటెడ్ తన రూ.4981 లక్షల రైట్స్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ను తెరిచినట్లు పేర్కొంది. ఇది ఫిబ్రవరి 11న ముగియనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వైర్లు, కేబుల్ తయారీ, ఎగుమతులు కలిగిన ఈ సంస్థ రైట్ ఇష్యూ ఒక్కో షేరు ధరను రూ.14.5గా నిర్ణయించింది. బిఎస్‌ఇలో వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. జనవరి 16, 2025 నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి 25 ఈక్విటీ షేర్లకు 9 రైట్స్ ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది.
