ఏపీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Jun 11,2024 16:23 #Rammohan Naidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దష్టి సారిస్తామన్నారు. పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పని చేస్తానని తెలిపారు. గతంలో పార్లమెంటులో రెండు నిమిషాల సమయం కోరాను.. కానీ ప్రజలు 21 మంది కూటమి ఎంపీలను గెలిపించి మాకు అధికారం అప్పగించారు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తాను.. అత్యంత చిన్న వయస్సు క్యాబినెట్‌ మంత్రిగా అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వ్యవహరిస్తాను అంటూ రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

➡️