పొంతనలేని సమాధానాలు

  • విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్‌

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో వైసిపి నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు బుధవారం విచారణకు హాజ రయ్యారు. విచారణ అనంతరం డిఎస్‌పి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యాలకు, మొదటి ముద్దాయి జోగి రమేష్‌ చెప్పిన సాక్ష్యాలను పొంతన లేదన్నారు. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తామని తెలిపారు. వారికి సంబంధించిన సోషల్‌ మీడియా ఖాతాలను కూడా తనిఖీ చేస్తున్నామని, వారి మొబైల్‌ ఫోన్‌ సిమ్‌ కార్డులను అడిగితే ఇప్పుడు అవి వాడటం లేదని చెప్పారన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి తెలియజేశారు.

➡️