కమ్యూనిస్టులపై అవగాహనారాహిత్యమైన విమర్శలు తగదు

Feb 2,2025 11:27 #CPM Telangana, #telakapalli ravi

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి

ప్రజాశక్తి-నెల్లూరు: ఇటీవల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నుకున్న తరువాత చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మండిపడ్డారు. సిపిఎం ఏపీ రాష్ట్ర 27వ మహాసభకు హాజరైన ఆయన మాట్లాడుతూ… అన్ని పార్టీలు కుల, మత రాజకీయాలు, అవకాశ వాద రాజకీయాలు చేస్తుంటే వాటికి అతీతంగా ప్రజల ప్రయోజనాలు శ్రామిక వర్గ చైతన్యం సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి పనిచేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు.

➡️