వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యుపిఎస్‌ అమలు

  • విజయవాడ రైల్వే డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌

ప్రజాశకి – అమరావతి బ్యూరో : యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యుపిఎస్‌) వచ్చే ఆర్థిక సంవత్సరం 2015-26 నుంచి అమల్లోకి రానుందని విజయవాడ రైల్వే డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌ తెలిపారు. విజయవాడ డిఆర్‌ఎం కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) చందాదారులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యుపిఎస్‌ను ఎంచుకోవచ్చన్నారు.
విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ పర్సనల్‌ ఆఫీసరు కట్టా ఆనంద్‌ మాట్లాడుతూ.. యుపిఎస్‌ను ఒకసారి ఎంపిక చేసుకుంటే మళ్లీ ఎన్‌పిఎస్‌కు మారే అవకాశం ఉండదన్నారు

➡️