పవన్‌తో యుఎస్‌ కౌన్సిల్‌ జనరల్‌ భేటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తో యుఎస్‌ కౌన్సిల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో మంగళవారం ఆమె నేతృత్వంలోని బృందం ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగ్గ అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికి తగిన సహకారం, మార్గనిర్ధేశనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యుఎస్‌ కౌన్సిల్‌ పొలిటికల్‌, ఎకనామిక్స్‌ విభాగం చీఫ్‌ శ్రీఫాంక్‌ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలికారే, శ్రీసిబప్రసాద్‌ త్రిపాఠి పాల్గొన్నారు.

➡️