ISRO: నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : ఇస్రో నూతన చైర్మన్‌గా వి.నారాయణన్‌ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో నూతనంగా నియమితులైన వి.నారాయణ లాంఛనంగా ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణన్‌ను మాజీ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌, ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది తదితరులు అభినందించారు.

➡️