అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం సహాయంతో రాజధాని నిర్మిస్తానని చెబుతున్నారు. అయితే, గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి హయాంలో అభివృద్ధి కుంటుపడింది. పేదలకు చెందిన లక్షలాది ఎకరాలు మంత్రులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి పేదలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మంగళవారం వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నేడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన హామీలపైనా, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపైన కేంద్ర ప్రభుత్వంతో చర్చించి హామీ తీసుకోవాలని వి. శ్రీనివాసరావు పత్రికా ప్రకటనలో సూచించారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్స్ :
– లక్ష డెబ్భై ఐదు వేల ఎకరాల పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఆ భూములు వెనక్కి తీసుకుని పేదలకి ఇవ్వాలి.
– 2.5 ఎకరా మాగాణి, 5 ఎకరాలు మెట్ట స్వంత భూమి ఉన్న రైతుల్ని మినహాయించాలి.
– అసైన్డ్ లాండ్ సవరణ జీఓ 596 రద్దు చేయాలి.
– చట్ట విరుద్ధంగా అదానీకి కేటాయించిన హైడెల్ ప్రాజెక్ట్, డేటా సెంటర్ల కింద ఇచ్చిన 2500 ఎకరాలు భూములు కూడా అందులో ఉన్నాయి.
– గత ఐదేళ్ళలో రెండు లక్షల పాతికవేల ఎకరాలు సెజ్, పరిశ్రమలు, ఇండిస్టియల్ కారిడార్ పేరుతో భూములు సేకరించి ఒక్క పరిశ్రమ పెట్టలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.
– ఇన్వెస్టర్ కారిడార్, ఎస్‌ఈజెడ్ లకు ఇచ్చిన భూములు ఐదేళ్ళు పైబడిన వాటిని పేదలకు తిరిగివ్వాలి
– ఏలూరు, కష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు కొంతమంది పెత్తందార్ల, మాజీ ఐఏఎస్ లు, ఐపిఎస్‌లు, మంత్రులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. వాటిని వాస్తవ అసైన్డ్ పేదలకు స్వాధీనం చేయాలి. వీటన్నింటి మీద ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలి.
– జీఓ 596ను, రిజిస్ట్రేషన్స్ కూడా రద్దు చేయాలి.
– గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మన రాష్ట్రానికి పనికిరాదు.
– 2014-17 తరహాలో పంటల భీమా పధకం వల్ల రైతులకు న్యాయం జరగదు. ప్రైవేటు కంపెనీలు 80% వాటా కలిగి ఉన్న భీమా… ఇచ్చేది ప్రభుత్వం.. తీసుకునేది ప్రైవేటు కంపెనీలు…
– రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలి..
– వ్యవసాయానికి ఉచిత ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలి . ఉచిత విద్యుత్ కొనసాగించాలి. స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేయాలని మా డిమాండ్.
– 6వేల కోట్లు వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల కోసం, స్మార్ట్ మీటర్ల కోసం గత ప్రభుత్వం అక్రమంగా ఖర్చుపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఖర్చునంతా ఆయా కంపెనీల నుంచి రికవరీ చెయ్యాలి.