ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : ప్రజలను మభ్యపెట్టి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపి గెలుపు తధ్యమని రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శనివారం పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో సంపద సృష్టిస్తామని మోసపూరిత హామీలను ఇచ్చి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈనెల ఐదున ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైసిపి పట్టణ అధ్యక్షులు గంగాధర్‌రెడ్డి, రాగిమానిపల్లి సర్పంచ్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
