ప్రజాశక్తి-విజయవాడ : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్‌పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.
