- కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పిటి వారెంట్‌పై మంగళవారం తీసుకెళ్లారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనను తీసుకెళ్లేందుకు జగ్గయ్యపేట పోలీసులు కడపకు వచ్చారు. జైలు సూపరింటెండెంట్‌ను కలిసి వర్రాను తమకు అప్పగించాలని కోరుతూ ఇందుకు సంబంధించిన పిటి వారెంట్ అందజేశారు. సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వర్రాను జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించడంతో జగ్గయపేటకు తరలించారు.