ప్రజాశక్తి – కంచికచర్ల (ఎన్‌టిఆర్ జిల్లా) : ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శుక్రవారం నుండే వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందే సెలవులు ఇవ్వడం, శని, ఆదివారాలు సెలవు కావడంతో హైదరాబాద్, తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో సహా తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో కీసర టోల్ ప్లాజా వద్ద కార్ల రద్దీ పెరిగింది. రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు లక్షలాది మంది విజయవాడ వైపుగా వెళ్లే అవకాశం ఉంది.