నిలిచిన ఇవిఎంల వెరిఫికేషన్‌

Aug 19,2024 22:29 #EVM, #ongle district, #ycp protest
  • మాక్‌ పోలింగ్‌ మాత్రమే చూపుతామన్న కలెక్టర్‌
  • అభ్యంతరం తెలుపుతూ బయటకు వచ్చిన వైసిపి ప్రతినిధులు

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్‌కు ఒంగోలు వైసిపి అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టిన దరఖాస్తుపై జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సోమవారం వెరిఫికేషన్‌ చేపట్టారు. ఇసి ఆదేశాల మేరకు ఇవిఎంలలో మాక్‌పోలింగ్‌ మాత్రమే నిర్వహిస్తామని వైసిపి ప్రతినిధులకు కలెక్టర్‌ చెప్పారు. ఇందుకు అంగీకరిస్తే ఇవిఎంల డేటా డిలీట్‌ చేసి.. మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. దీనిపై వైసిపి నుంచి హాజరైన లోకేష్‌రెడ్డి, ఓగిరాల వెంకట్రావు, సోమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవిఎంలో ఉన్న ఓట్లకు, వివిప్యాడ్‌లో ఉన్న స్లిప్‌లను లెక్కించి తేడాలు గుర్తించాలని వారు కోరారు. ఇందుకు కలెక్టర్‌ అంగీకరించలేదు. ఇసి ఆదేశాల మేరకే మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో వైసిపి వారు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడంతో వెరిఫికేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఇవిఎంలో నమోదైన ఓట్లను, వివి ప్యాడ్‌లో స్లిప్‌లను లెక్కించాలని కోరుతూ వైసిపి అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారానికి కేసు వాయిదా పడింది.

➡️