Video – ఈ నెల 13 న విజయవాడలో సమైక్యతా శంఖారావం

Apr 11,2025 12:46

విజయవాడ : సొసైటీ ఫర్‌ కమ్యూనల్‌ హార్మొని సంస్థ ఈ నెల 13వ తేదీన విజయవాడలో సమైక్యతా శంఖారావం నిర్వహిస్తుందని దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమైక్యతా శంఖారావం సదస్సులో నేతలు మీడియాతో మాట్లాడారు. పలు సంఘాలు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలియజేశాయి. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

➡️