జోరుగా తొలకరి ఊడ్పులు.. 50 శాతం పూర్తి అయిన నాట్లు

Jul 16,2024 11:10 #Konaseema, #rice crop, #vari natlu

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తొలకరి ఊడ్పులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 50 శాతం వరి నాట్లు పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు. కే గంగవరం మండల పరిధిలో ఇప్పటివరకూ 2320 ఎకరాలు వెదజల్లడం ద్వారా, 3180 ఎకరాలు నాట్లు వేయడం ద్వారా మొత్తం 5500 ఎకరాల్లో నాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. అలాగే ఖరీఫ్‌ 2024కు సంబంధించి ఈ క్రాప్‌ నమోదు నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందనీ రైతులందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. మరో రెండు వారాల్లో వరి నాట్లు మొత్తం పూర్తవుతాయని ఆయన వివరించారు. అధిక శాతం స్వర్ణ రకం తొలకరికి నాట్లు వేస్తుండగా మరో 10 శాతం బోండాల రకం నాట్లు వేస్తున్నట్లు ఆయన వివరించారు. తొలకరికి సంబంధించిన ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు.

➡️