- పదిమంది కార్మికులకు అస్వస్థత
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి పంచాయతీ థాపర్ వాటర్ బేస్ కంపెనీలో అమ్మోనియా లీక్ అవ్వడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది కళ్లమంటలు, ముక్కు, గొంతులో మంట, దగ్గు, వాంతులతో ఇబ్బందిపడ్డారు. ఈ కంపెనీలోని రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతోంది. దాదాపు 500 మందికిపైగా కార్మికులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం ఒక్కసారిగా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. దీంతో సుమారు పదిమందికి పైగా కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తెలుస్తోంది. అమ్మోనియం గ్యాస్ లీక్‌తో ఉలిక్కిపడ్డ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు స్థానికులు, బాధితులు విజ్ఞప్తి చేశారు.