ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కృష్ణ, ఎన్‌టిఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఆదేశాలు
జారీ చేశారు.
