ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

May 13,2024 12:25 #Protest, #tadepalligudem, #voters

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్‌ఎన్‌ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు పంపిణీ నిలిపివేయడంతో ఓటర్లు ఆందోళన చేపట్టారు. నిన్న ( ఆదివారం ) రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు వరకు నిలబెట్టి ఓటుకు నగదు ఇస్తామని చెప్పడంతో స్థానికులు ఆ చోటనే ఉండిపోయారు. ఎంత సేపటికీ వైసీపీ నేతలు అక్కడికి రాకపోవడంతో స్థానిక ఓటర్లు నిరసన తెలిపారు. లేటుగా వచ్చిన కొండ్రిపోలు మెట్ట వైసీపీ నేతపై అక్కడి జనాలు తిరగబడ్డారు. ఓటుకు 2500 రూపాయలు లేవు.. కేవలం 500 రూపాయల మాత్రమే ఇస్తానని వైసీపీ నేత అనడంతో స్థానిక ఓటర్లు మరింతగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటుకు 2,500 రూపాయలు తీసుకుని పంచుతామని.. ఇక్కడ మమ్మల్ని తెల్లార్లు నిలబెట్టి మాకు ఇప్పుడు 500 రూపాయలు మాత్రమే ఇస్తామని అనడం దారుణమని ఓటర్లంతా అతడిని నిలదీశారు. ఓటు వేయడానికి వెళ్లకుండా డబ్బులు తమకు ఓటుకు రూ.2500 పంచాల్సిందే అంటూ అక్కడి స్థానిక ఓటర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.

➡️