కమ్యూనిస్టులకు వేసే ఓట్లు వృధా కావు : సిపిఎం నేత సిహెచ్‌.బాబూరావు

విజయవాడ : ఒకే పార్టీకి, ఒకే ఆలోచనకి కట్టుబడి ఉండే కమ్యూనిస్టులకు వేసే ఓటు వృధా కాబోదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో చేపట్టిన ప్రచార ర్యాలీలో బాబూరావు మాట్లాడుతూ …. కమ్యూనిస్టులకు వేసే ఓటు వృధా కాదని సద్వినియోగం అవుతుందని చెప్పారు. ఇతర పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేనలకు ఓటు వేస్తే వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ? అని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశంలో గెలిచి ఈరోజున వైసిపిలో ఉన్నారని చెప్పారు. అలాగే వైసిపిలో మంత్రులుగా పనిచేసినోళ్లు ఈరోజున టిడిపిలో ఉన్నారని అన్నారు. వీళ్లకు ఓటు వేస్తే ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదన్నారు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా… అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లిపోతుంటారని ఎద్దేవా చేశారు. అలాంటివారికి ఓటేస్తే వృధా అవుతుందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు మాత్రం ఒకే మాటకు, ఒకే పార్టీకి, ఒకే ఆలోచనకి కట్టుబడి ఉంటారని… కమ్యూనిస్టులకు వేసే ఓట్లు వృధా కాబోవని ఉద్ఘాటించారు. మొక్కకి పోసే నీరూ వృధా కాదు … కమ్యూనిస్టులకు వేసే ఓటూ వృధా కాదు… అని ప్రజా సేవకు నిలిచే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు.

➡️