ఇవిఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఓటింగ్‌ ఆలస్యం

May 13,2024 13:19 #vote

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్
రెంటచింతలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి నేతలు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి పట్టణంలో శాలివాహన నగర్‌లో పోలింగ్‌బూత్‌ 55లో ఇవిఎం మొరాయించింది. దుగ్గిరాల బూత్‌ నంబరు 250,251,252లో ఇవిఎంలు మొరాయించటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో టిడిపి ఏజెంట్‌ ఫారం ఇవ్వటానికి వెళ్లిన మహిపాతి సుబ్బయ్యపై వైసిపి నాయకుల దాడిచేశారు. క్షతగాత్రులకు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుర్రపాలెంలో టిడిపి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఓటేశారు. ఈపూరు మండలంలోని అంగలూరు, గుండెపల్లి గ్రామాల్లో వివి పాట్‌ మొరాయించటంతో ఓటింగ్‌ ఆలస్యమైంది. మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి పంచాయతీ కార్యాలయం వెనుక నున్న పోలింగ్‌ కేంద్రంలో 3.30 నుంచి 4 గంటలపాటు ఆలస్యంగా ఓటింగ్‌ ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గంలోని జూపూడి, కిలేశపురం ప్రాంతాల్లో ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

➡️