కెకె లైన్ తో సహా వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ లో చేర్చాలి

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ :  కెకె లైన్ తో సహా వాల్తేర్ డివిజన్ ను కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖ డివిజన్ లో కలపాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎదుట సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన ప్రజా పోరాట విజయం అన్నారు. సిపిఎం వాముపక్ష పార్టీలు వివిధ ప్రజాసంఘాలు రైల్వే ఉద్యోగ సంఘాలు ప్రజలు సుదీర్ఘకాలం చేసిన పోరాటం, ప్రజా ప్రతినిధుల కృషి ఫలితంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కానుందని తెలిపారు. అయితే మోడీ ప్రభుత్వం విశాఖకు ఉత్తరాంధ్రకు నష్టం చేసే చర్యలు, విపక్షత ఆపలేదని విమర్శించారు. వాల్తేర్ డివిజన్ ను మొక్కలు చేశారని ఇది సరికాదన్నారు. అత్యంత కీలకమైన కొత్తవలస కిరం డోల్ కెకె లైన్ రైలు మార్గంను విశాఖ డివిజన్లో కాకుండా, కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్లో చేర్చడం దుర్మార్గం అన్నారు. వాల్తేర్ డివిజన్ సాలీనా రూ.10500 ఆదాయం పొందుతున్నది అంటే దీనికి కారణం కెకె లైన్ అన్నారు. అటువంటి కేకే లైన్ ను విశాఖ నుండి తొలగించి ఒడిశాలో కలపడం అంటే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయటమేనని ఆరోపించారు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక రంగంగా ఉన్న అరకు రైల్వే స్టేషన్ ను కూడా విశాఖ డివిజన్ నుంచి తప్పించి, రాయగడ డివిజన్లో చేర్చడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి కుమార్, జిల్లా నాయకులు ఎం. సుబ్బారావు, ఉరుకూటి రాజు, టి.నూకరాజు, ఎల్.జె. నాయుడు, గొలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️