- న్యాయవాది సమక్షంలో ప్రశ్నలు
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : పోలీసుల విచారణలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి దాటవేత ధోరణి అవలంభించినట్లు తెలుస్తోంది. బుధ, గురువారాల్లో చేపట్టిన పోలీసు విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అస్పష్టత, దాటవేత ధోరణికి ప్రాధాన్యత ఇవ్వడంతో తదుపరి విచారణకు పిలవడమెలా అనే అంశంపై పోలీస్ యంత్రాంగం తర్జనభర్జనల్లో నిమగమైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఎస్‌సి, ఎస్‌టి కేసులో కడప సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్న నిందితుడిని పోలీసులు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టును పోలీసులు ఆశ్రయించారు. రెండ్రోజుల కస్టడీకి మంగళవారం కోర్టు అనుమతించింది. కడప సిసిఎస్ పోలీసులు బుధ, గురువారాల్లో న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డింగ్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. సోషల్ మీడియా పోస్టుల వెనుక కడప ఎంపి పిఎ రాఘవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి సహా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది.