శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం

Jun 11,2024 09:56 #flood water, #srisailam

ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వలన తెలంగాణ రాష్ట్రం జూరాలకు కొద్దిపాటి నీటి ప్రవాహం చేరుతోంది. తుంగభద్ర నది నుంచి సోమవారం ఉదయం నుంచి 4052 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 809 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.70 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 33.780 టిఎంసిలుగా నమోదైంది.

➡️