హామీలు అమలు చేస్తున్నాం : మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశలో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. వంద రోజుల పాలనలో ఇప్పటి కే ఆ దిశలో ఎనోకన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీలు పి అశోక్‌ బాబు, బిటి నాయుడులతో కలిసి టిడిపి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది వాస్తవమని అన్నారు . సంక్షేమాన్ని, ప్రగతిని రెండు కళ్లుగా చూసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లో రెవెన్యూ సదస్సులతో పాటు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జరిగిన తప్పులను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

పునరుజ్జీవం పోసుకున్న పారిశ్రామిక రంగం
చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవం పోసుకుందని ఎమ్మెల్సీ బిటి నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు అనుగుణంగా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు.

➡️