స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం

Apr 12,2025 21:53 #Dharna, #Protest, #Steel plant, #vizag
  • పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించడమేకాక లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాలతో రక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు రామచంద్రరావు, శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1521వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు కార్యకర్తలు, ఉక్కు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ… స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు. కార్మికులను తొలగించరాదని, నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉక్కు పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️