దేశానికి హైదరాబాద్‌ ను రోల్‌ మోడల్‌ గా మార్చుతాం : మంత్రి కోమటిరెడ్డి

May 14,2024 17:15 #Minister Komati Reddy, #press meet

హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో కొంతమంది నేతలు విహార యాత్రలకు బయలదేరితే.. మరికొందరూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఇంకొందరూ మాత్రం మే 27న జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ లో సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ గా ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చిందన్నారు. దీంతో పాటు హైదరాబాద్‌ నుంచి విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సాధన కోసం కూడా గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నించానని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఒక ఎక్స్‌ ప్రెస్‌ హైవే పెట్టాలని.. ఒక గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు కోమటిరెడ్డి. అది మంజూరు అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎవ్వరూ ఫ్లైట్‌ ఎక్కరని తెలిపారు. దేశంలో హైదరాబాద్‌ ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఇంకా ఎన్నో అభివఅద్ధి చేయాల్సినవి ఉన్నాయని వెల్లడించారు. ప్రజల కోసమే కాంగ్రెస్‌ పని చేస్తుందని తెలిపారు.

➡️