ఫూలే స్ఫూర్తితో ‘ఉక్కు’ను కాపాడుకుంటాం

Apr 11,2025 20:54 #visakha steel plant

– స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : మహాత్మా జ్యోతిరావు ఫూలే పోరాట స్ఫూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకుంటామని స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌ అధ్యక్షులు బి.అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1521వ రోజుకు చేరాయి. దీక్షలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ పోరాటానికి ఒబిసి అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గంటోందన్నారు. త్యాగాలతో సాధించుకున్న కర్మాగారాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించారు. ప్లాంట్‌ను రక్షించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా కార్మికవర్గం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పాల్గన్నారు.

➡️