ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం

  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1387వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ యూజ్‌, డిఐటియు, జెఎంఎస్‌, విఎస్‌ఇయు, విఎస్‌ఎంఎస్‌ యూనియన్ల కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు శ్రీనివాస్‌, అప్పారావు, పరంధామయ్య మాట్లాడుతూ ఐక్యంగా పోరాడుతున్న కార్మికులను విడగొట్టేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కార్మికులపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారని, జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌లో ఉత్పత్తిని తగ్గించి మూసివేత దిశగా నడిపేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. వాటన్నింటినీ తిప్పికొట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

➡️