నేడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరంలో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా కూటమి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చంచారు. ప్రధానంగా త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చంచారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు ఎమ్మెల్సీలు గెలిచామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నిక ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తామని, వచ్చే విద్య సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా అంతజేస్తామన్నారు. అలాగే మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తెస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.