తెలంగాణకు రాబోయే మూడు రోజులు వర్ష సూచన -వాతావరణ శాఖ

May 15,2024 15:45 #Meteorological Department, #Report

హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మే19న బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్‌ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రానికి బుధవారంతో పాటు వచ్చే రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది.

➡️