ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నా.. నేటికీ పెద్దలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిన దాఖలాల్లేవన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6ను సూపర్-7గా మార్చాలని, అన్ని గ్రామాల్లో వ్యవసాయ కార్మిక కుటుంబాలకు సరిపడా ఉపాధి పనులు కల్పించి వలసలను అరికట్టాలనిడిమాండ్ చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగంలో పెద్దయెత్తున యాంత్రీకరణ ప్రవేశపెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉన్న వ్యవసాయ కార్మికుల సమస్యలు, సంక్షేమ బోర్డు గురించి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఎక్కడా చర్చించినట్లు దాఖలాల్లేవన్నారు.
