మంత్రిగా ఐదేళ్లు ఏం చేశారు

Nov 30,2024 20:37 #former minister Roja, #PCC, #questioned
  • మాజీ మంత్రి రోజాను ప్రశ్నించిన పిసిసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సోలార్‌ విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్లకు ఒప్పందం ఎందకు కుదుర్చుకున్నారని మాజీ మంత్రి రోజాను పిసిసి ప్రశ్నించింది. పిసిసి చీఫ్‌ షర్మిలపై రోజా ‘ఎక్స్‌’లో చేసిన వ్యాఖ్యలకు పిసిసి శనివారం కౌంటర్‌ ఇచ్చింది. ఇవి తమ రాతలా లేక సకల శాఖల మాజీ మంత్రి రాసిందా? లేక సాక్షి పంపిన స్క్రిప్టా? అంటూ ప్రశ్నించింది. అదాని నుంచి యూనిట్‌ రూ.2.49కి కొన్నా వీలింగ్‌ చార్జీలు, జిఎస్‌టి కలిసి రూ.4.16కి చేరుతుందని వెల్లడించింది. చంద్రబాబు హయాంలో ఇంకా ఎక్కువకు సోలార్‌ విద్యుత్‌ కొన్నారని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా, ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశించింది.

➡️