రాష్ట్రానికి మీరేం చేశారు?

Apr 19,2024 02:40 #coments, #perni nani, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడుతోపాటు పవన్‌కల్యాణ్‌, బిజెపి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బందరు సభలో పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. శిరోముండనం ఘటన టిడిపి హయాంలో తోట త్రిమూర్తులు టిడిపిలో వున్నప్పుడే జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయాలకు ఇప్పుడిప్పుడే వచ్చిన తన కుమారుని పట్ల కూడా అనుచితంగా మాట్లాడి వారి వయసుకు వున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తాను అవినీతి పరుడో, కొల్లు రవీంద్ర ఎంత అవినీతి పరుడో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు.

➡️