ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వడానికి ఇబ్బందేమిటీ?

Apr 3,2024 22:20 #janasena pawan, #tweets

– ట్విట్టర్‌ వేదికగా సిఎస్‌ను ప్రశ్నించిన పవన్‌కల్యాణ్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛను ఇవ్వడానికి ఉన్న ఇబ్బందేమిటని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని ప్రశ్నించారు. తన సినిమా రిలీజ్‌ అయితే థియేటర్స్‌ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు విధులు వేస్తున్నప్పుడు పింఛన్లు పంపిణీ చేయడానికి ఉద్యోగులు లేరా? అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకు విధులు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు ఇళ్ల దగ్గర ఇవ్వొచ్చని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

➡️