విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిపై శ్వేతపత్రం : మంత్రి భట్టి

Dec 21,2023 12:02 #Assembly Meeting, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు రూ.62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలయిందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

➡️