జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటి?: సీపీఐ నారాయణ

May 21,2024 15:30 #comentes, #cpi narayana, #TDP, #YCP

ప్రజాశకి-అమరావతి : రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఏపీ రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడుతూ.. జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం సరికాదన్నారు. నాయకుడి లక్షణం ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. పోలింగ్‌ అనంతర అల్లర్లపై జ్యూడీషియల్‌ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో అల్లర్లపై సిట్‌ వేయడం వల్ల ఉపయోగం లేదని, ఇటీవలి హింసపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం జరిగిన ఘటనలపై జ్యుడిషియల్‌ విచారణ జరగాలని స్పష్టం చేశారు. ఏపీలో స్ట్రాంగ్‌ రూమ్స్‌ దగ్గర భద్రత లేదని.. కనీసం అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు అని ఆయన అన్నారు.

➡️