హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదు ? : జివి.ఆంజనేయులు

అమరావతి : కారంపూడి సిఐ పై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి  రామకృష్ణా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని టిడిపి నేత జివి.ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలబడుతున్నారని విమర్శించారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవిఎం ధ్వంసం కేసులో మాత్రమేనని తెలిపారు. విధుల్లో ఉన్న సిఐ ని కొట్టి గాయపరిచినా అరెస్టుకు ఎందుకంత భయమన్నారు. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంటున్నా పోలీసుల్లో కనీస చలనం లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు వైసిపి స్వామి భక్తిని పక్కన పెట్టకపోతే కౌంటింగ్‌ రోజు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

➡️