- మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి
- మహిళలకు రక్షణ పెరగాలి
- మహిళా గర్జన ర్యాలీలో వక్తలు
ప్రజాశక్తి-విజయనగరం కోట : భారతదేశంలో మహిళా చట్టాల కఠినంగా అమలు చేయాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. వాజీ ఛానల్, జనవిజ్ఞాన వేదిక, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా గర్జన ర్యాలీ కార్యక్రమం సోమవారం విజయనగరం కోట వద్ద ప్రారంభించారు. ఈ ర్యాలీ గురుజాడ జంక్షన్ మీదుగా పైడితల్లమ్మ కోవెల మూడు లాంతర్లు, గంట స్తంభం, మహారాజా కాలేజ్ మీదుగా గురిజాడ సెంటర్ వరకు చేరుకుంది. ఇక్కడ వాజీ ఛానల్ ఎండి గణపతి నీది శ్రీనివాసరావు రోటరీ క్లబ్ డాక్టర్ వెంకటేశ్వరరావు వివిధ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ చట్టాలు పెరగాలన్నారు. స్త్రీ, పురుషుల మధ్య బేధం లేకుండా కుటుంబంలో చూడాలన్నారు. ప్రభుత్వాలు మహిళలకు ఏం జరిగినా వెంటనే స్పందించే విధంగా ప్రతి చోట నెంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లోనూ, రైల్వే స్టేషన్ లోనూ ఏ విధంగా అయితే సూక్తులు రాసి ఉంటాయో అదేవిధంగా ప్రతి జంక్షన్లోనూ, కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రధాన కూడళ్లో రక్షణ చట్టాల నెంబర్లు రాసి పెట్టాలని అన్నారు.