అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

Feb 21,2024 15:48 #CPM AP, #manifesto, #Women
Women's welfare and protection in manifesto of all parties
  • కోరిన మహిళా సంఘాలు

ప్రజాశక్తి-విజయవాడ : రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలు చేర్చాలని కోరుతూ మహిళా సంఘాల రాష్ట్ర నాయకత్వం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి  వి శ్రీనివాసరావును కోరింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ…. మహిళా సంఘాల అభ్యర్ధనను పరిశీలించి, మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మోడీ ప్రభుత్వ హాయంలో మనువాదాన్ని అమలు చేస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలు అభ్యర్ధనను ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మహిళా సంక్షేమానికి, రక్షణను కట్టుబడి ఉండాలని, ఆ దిశగా హామీలు అమలు చేయాలని కోరారు.

➡️