ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : తిరుపతి జిల్లా పుత్లూరు ఆరేటమ్మ గిరిజన కాలనీకి చెందిన డి.హరి (30) వడదెబ్బతో గురువారం మృతి చెందారు. ఎప్పటిలాగే గురువారం పెయింటింగ్ పనులకు వెళ్లారు. ఎండివేడిమి, ఉక్కుపోతకు తాళలేక వడదెబ్బకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ఆయయనకు భార్య యమున, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
