కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి

May 1,2025 18:49 #Anantapuram District, #May Day

సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మతాలు వేరైనా కులాలు వేరైనా కష్టపడి పని చేసే శ్రామికులందరూ ఒక్కటే అని తెలియజేసి అందరూ కలిసి చేసుకునే పండుగ మే డే దినోత్సవం దేశమంతటా చేసుకుంటున్న కార్మికుల పండుగ మేడే కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి శ్రమకు తగ్గ జీతం ఇవ్వాలని పని భారం తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిర్వహించిన మేడే కార్యక్రమానికి హాజరైనారు మేడే సిఐటియు జెండాని మున్సిపల్ కార్మికుడు నారప్ప జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేంద్ర కుమార్ వెంకటనారాయణ ముర్తుజ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడుతూ దేశాన్ని ముందుండి నడిపిస్తున్న కార్మిక కృషిని కష్టాన్ని గుర్తించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటల పని విధానం ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల ప్రాణ త్యాగాలు చేసిన తరువాతనే ఎనిమిది గంటల పని విధానం అమలు కావడం జరిగిందన్నారు. 150 సంవత్సరాల కిందట పెట్టుబడిదారులు 18 గంటల పని విధానాన్ని అమలుచేసి కార్మికుల కష్టాన్ని శ్రమని, చెమటని సొమ్ము చేసుకొని అందలమెక్కడం జరుగుతున్నదన్నారు. కార్మికులు మాత్రం పూట గడపడానికి కుటుంబాలకి దూరమవుతూ శ్రమ దోపిడీకి గురి కావడం జరుగుతున్నదన్నారు. కార్మికులందరూ ఐక్యత పోరాటం చేసి తమ ప్రాణాలు పోగొట్టుకొని సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మరలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు 14 గంటల పని విధానాన్ని అమలులోకి తేవాలని యత్నిస్తున్నదని మండిపడ్డారు.  రాజ్యాంగ నిబంధనలను కొట్టివేస్తూ రాజ్యాంగాన్ని మార్చేసి 44 లేబర్ కోర్టుగా ఉన్న చట్టాన్ని నాలుగు లేబర్ కోర్టులుగా కుదించారన్నారు. నాలుగు లేబర్ కోట్ల విధానం అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి అందలం ఎక్కించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి తప్ప కార్మికుల కష్టాన్ని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయిందన్నారు. రాష్ట్ర ప్రజలందరిని ఆరోగ్య వంతులు చేస్తున్న మున్సిపల్ కార్మికులు అర్ధాకలితో చస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మున్సిపల్ కార్మికులకు కాళ్లు కడిగి పాపాలు పోగొట్టుకుంటున్నారని మండిపడ్డారు.  మున్సిపల్ కార్మికులకు కాళ్లు కడిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పాపం పోదు మున్సిపల్ కార్మికులకు జీతం పెంచి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల హత్యాచారము వేధింపులు హత్యలు చేస్తున్నటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళలకు రక్షణగా ప్రభుత్వాలు నడుచుకోవాలని కార్మికుల శ్రమ నీ కష్టాన్ని గుర్తించాలని పెట్టుబడిదారుల కాకుండా కార్మికులకు అండగా ఉండాలని తెలియజేశారు. లేని పక్షాన కార్మికులందరూ ఐక్యత పోరాటానికి సంసిద్ధమవుతారని హెచ్చరించారు. కార్మికుల కష్టాల్లో ప్రతిక్షణం సిపిఎం, సిఐటియు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్టీఆర్ సీనా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ రెగ్యులర్ కార్మికుల నగర అధ్యక్షులు ముత్తరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రి స్వామి తిరుమలేష్ ట్రెజర లక్ష్మీనరసమ్మ, నగర ఉపాధ్యక్షులు శశింద్ర కుమార్, మహిళా కన్వీనర్ వరలక్ష్మి, కమిటీ సభ్యులు నారాయణస్వామి, ప్రభాకర్, బంగ్లా రాఘవేంద్ర, ప్రసాద్, పెన్నా అశోక్, మరియమ్మ, తదితర కార్మికులందరూ పాల్గొన్నారు.

➡️