తాగునీటి కోసం రాస్తారోకో

Apr 2,2024 20:35 #Dharna, #drinking water

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) :తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు బుధవారం రోడ్డెక్కారు. గత వారం రోజులుగా శింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు కందుకూరు రోడ్డు వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారుల్లో ఎలాంటి చలనమూ లేదన్నారు. కొన్ని ప్రాంతాలకే రామతీర్థం నీరు సరఫరా అవుతోందని, మరికొన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అవ్వడంలేదని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ , ఎస్‌ఎ. గౌస్‌, యస్‌థాని పాల్గొన్నారు.

➡️