XXX: త్రిపుల్‌ ఎక్స్‌ సోప్‌ అధినేత మృతి

Mar 14,2025 08:27 #passed away

పలువురు సంతాపం – నేడు అంత్యక్రియలు
ప్రజాశక్తి-గుంటూరు : ప్రముఖ వ్యాపారవేత్త, త్రిపుల్‌ ఎక్స్‌ సోప్‌ కంపెనీ అధినేత అరుణాచలం మాణిక్యవేల్‌ గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్‌ హాస్పిట్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్థానిక అరండల్‌పేటలోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం ఉంచారు. భార్య పరిమళ, కుమారుడు పర్వీన్‌రాజ్‌, కుమార్తె భారతి ఉన్నారు. తమిళనాడుకు చెందిన అరుణాచలం మాణిక్యవేల్‌ గుంటూరులో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

➡️