యాదగిరిగుట్టలో యాత్రికుల సందడి

Jun 9,2024 14:35 #bustling, #Pilgrims, #yadagirigutta

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టకు యాత్రికులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాత్రికులతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాత్రికుల కొలాహలం నెలకొన్నది.అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి యాత్రికులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి యాత్రికులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.

➡️