మీడియా అణిచివేతపై చర్యలు తీసుకోండి- ట్రాయ్ కు వైసిపి ఫిర్యాదు

Jun 11,2024 21:54 #complaint, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌లో టివి ఛానెళ్లపై అణిచివేత జరుగుతోందని, తక్షణమే జోక్యం చేసుకోవాలని వైసిపి రాజ్యసభ సభ్యులు ఎస్‌ నిరంజన్‌రెడ్డి ట్రారుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రారు ఛైర్మన్‌, కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి, సెక్రటరీలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కేబుల్‌ ఆపరేటర్ల అసోషియేషన్‌ టివి9, ఎన్‌టివి, 10 టివి, సాక్షి టివి ప్రసారాలను అకారణంగా అక్రమంగా నిలిపివేస్తూ చర్యలు తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూస్‌ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్దమని తెలిపారు. తక్షణమే రాష్ట్రంలో టివి ఛానెళ్లపై అణిచివేతపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️