దొంగ సర్వేలతో వైసిపి మైండ్‌ గేమ్‌

Apr 12,2024 22:05 #Raghuramakrishna Raju, #speech

– ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఎంపి రఘురామ కృష్ణంరాజు
ప్రజాశక్తి – పెదఅమిరం (పశ్చిమగోదావరి జిల్లా) :దొంగ సర్వేలతో వైసిపి నాయకులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్‌ ఎక్కడపడితే అక్కడ లభిస్తున్నాయని అన్నారు. మంతెన రామరాజుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే పెట్రోల్‌ పోసుకుంటామని బెదిరించడం సరికాదన్నారు. తనని ఈ ఊరువాడు కాదని మాట్లాడుతున్నారని, తాను ఈ ప్రాంతం వాడినేనని స్పష్టం చేశారు. తన స్వగ్రామం ఐ భీమవరం అని పెదఅమిరంలో ఉంటున్నానని చెప్పారు. ఢిల్లీ నుంచి ముగ్గురు బిజెపి ప్రతినిధులు వస్తున్నారని, వారి సమావేశం అనంతరం ఎంపిగా అవకాశం వస్తే పోటీ చేస్తానని, లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. రామరాజు ఒకపక్క వైసిపితో మంతనాలు జరుపుతూ మరోవైపు టిడిపిని అల్లరి చేయడం సరైంది కాదన్నారు.

➡️