టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

  •  పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ చేరుకున్నారు. వసంత కష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్‌ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు.

➡️