ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంపై దాడి కేసులో ఆయనను బెంగళూరులో అరెస్ట్ చేసి మంగళగిరికి తరలిస్తున్నారు. ఇదే కేసులో ఉదయం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టడంతో సురేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌తో పాటు పలువురిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వారందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి దాఖలు పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వారి కోసం పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు.
