తప్పును కులానికి అంటగడుతున్నారు : వైసిపి ఎమ్మెల్సీ రఘురామ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు తప్పుచేసి దాన్ని కులానికి అంటగడుతున్నారని వైసిపి ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ ఆరోపించారు. ఇలాగే ప్రవర్తిస్తే ఇతర కులాల వారు తిరగబడతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌నుద్దేశించి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలు ఆయన కుల జాడ్యానికి నిదర్శమన్నారు. జగన్‌కు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పరిశ్రమలకు సానుకూల పరిస్థితి లేదు : నాగార్జున

పరిశ్రమలకు రాష్ట్రంలో సానుకూల పరిస్థితి లేదని, పారిశ్రామికవేత్తలను కూటమి నాయకులు బెదిరిస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ తెలిపారు. కమీషన్ల కోసం అధికార పార్టీ నాయకులు పారిశ్రామివ్తేతలను వేధిస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యేలే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వల్లే కడప స్టీల్‌ ఆగిపోయిందని, సజ్జన్‌ జిందాల్‌ను వేధింపులకు గురిచేసి తరిమేయడంతో రూ.50 వేలకోట్ల పెట్టుబడులు రాకుండా పోయాయని, వెంటనే క్షమాపణలు చెప్పి ఆయన్ను వెనక్కు తీసుకురావాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి లోకేష్‌ బాధ్యత వహించాలన్నారు.

➡️